రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని:
రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ భవన్‌లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్,ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, బొజ్జు పటేల్ కలిసి నరేందర్ రెడ్డిని అభినందించారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం రాష్ట్ర అభివృద్ధికి మరింత తోడ్పడాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి ప్రజల సమస్యలను పార్లమెంటులో బలంగా వినిపించి, రాష్ట్రానికి న్యాయం చేసే నాయకుడిగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర స్థాయిలో తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు, నిధులు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
నరేందర్ రెడ్డి తనకు లభించిన ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY