నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దుచేసి పాత లేబర్ చట్టాల్ని కొనసాగించాలి…!
కార్మిక సంఘాల బ్లాక్ డే పిలుపుమేరకు గోదావరిఖని గాంధీ చౌక్ చౌరస్తాలో నిరసన…
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని . కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడుల ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డే టూ పిలుపునివ్వడం జరిగింది.
ఈ పిలుపులో భాగంగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఐఎన్టీయుసి నుండి భూమళ్ళ చందర్, ఏఐటీయుసి శనిగరపు చంద్రశేఖర్, సిఐటియు వేల్పుల కుమారస్వామి, ఐఎఫ్టీయు ఈ నరేష్, టీ యు సీ ఐ ఈ రాజేందర్ లు మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతాయని వీటిని రద్దు చేయాలని, పాత లేబర్ చట్టాలను కొనసాగించాలని, గత ఐదు సంవత్సరాలుగా దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు సమ్మెలు చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాలేదని, చివరికి ఈ ఏప్రిల్ 1తేదీ నుండి అమలు చేయుటకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీనివలన కార్మిక వర్గానికి రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని, కార్మిక వర్గం అంతా ఐక్యంగ ప్రతిఘటించి నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు అయ్యేంతవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కార్మిక సంఘాల నాయకులు చిలుక శంకర్, తోకల రమేష్, అబ్దుల్ కరీం,ఐ రాజేశం, ఎం దుర్గయ్య, కే ఎల్లయ్య, ఎడ్ల రవికుమార్, పెరిక వెంకటస్వామి, డి బుచ్చమ్మ, పెరిక మొండయ్య, ఎస్ ప్రసాద్, పోగుల శేఖర్, బి లింగన్న, అజీముద్దీన్, రాయపోచం. తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
విప్లవాభివందనలతో

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY