సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే

Sakshitha news

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే

*సాక్షిత : 1) హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
2) గ్రామస్తుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
3) స్థానిక ఎన్నికల గురించి చర్చించారు.
4) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను పరామర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలో రాత్రి పర్యటించిన శాసనసభ్యులు జారె ఆదినారాయణ. నూతనంగా మంజూరైన సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు కోట్లతో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కొమ్ముగూడెం గ్రామంలో పనులు పూర్తయిన రెండు హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అదేవిధంగా గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. అనంతరం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను పరామర్శించి మెరుగైన వైద్యం అవసరం ఉంటే తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్ మన్నెం అప్పారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.