మాటకు కట్టుబడడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం
** చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పునరుద్ఘాటన
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: రాష్ట్ర రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేయడం మన సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పునరుద్ఘాటించారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం శంఖంపల్లి పంచాయతీలో శుక్రవారం “ఎన్టీఆర్ భరోసా” పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే నానికి ముందుగా శంఖంపల్లి పంచాయతీ మహిళలు, మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతీ నెల 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వందే నిజమైన ప్రజా ప్రభుత్వం అన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అని నిరూపిస్తున్న విషయాన్ని ప్రజలే గమనించారని తెలిపారు.
పర్యటనలో భాగంగా వృద్ధులు, వికలాంగులకు ఎమ్మెల్యే నాని ఇంటి వద్దకే వెళ్లి పింఛను పంపిణీ చేశారు. పాకాల మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛను 100 శాతం పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని కోరారు. తాము ప్రజల కష్టాలను, సమస్యలు తెలిసినవారు కాబట్టే మా పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగుతుందని తెలియజేశారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు వెళ్తానని ప్రజలకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు ఉంటే స్థానిక నాయకుల ద్వారా కానీ…. మండల నాయకుల ద్వారా కానీ త్వరితగతిన పూర్తి చేయాలని నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
