మునగాల మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక
సాక్షిత : సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 మునగాల మండల నూతన కమిటీని జిల్లా పొలిటికల్ కన్వీనర్ బద్దంరాజు కృష్ణ ప్రసాద్, కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి,మునగాల మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మునగాల మండల టౌన్ అధ్యక్షుడిగా వేట అశోక్, మండల ఉపాధ్యక్షుడిగా గడ్డం వినోద్, జనరల్ సెక్రెటరీ చిర్ర వివేక్, జాయింట్ సెక్రెటరీ చిర్ర ప్రవీణ్, ట్రెజరర్ మహేందర్ వీరిని మండల నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పొలిటికల్ కన్వీనర్ బద్దం రాజు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మునగాల మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్న కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మండల కమిటీ ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా మండల కమిటీకి పిలుపునిచ్చినారు.
ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం అంజి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 అధ్యక్షుడు డాక్టర్ నవీన్ తేజ ఆదేశాల మేరకు ఆయా మండల కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మునగాల నూతన మండల కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. మునగాల మండలంలో ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చినారు. అనంతరం జిల్లా పొలిటికల్ కన్వీనర్ బద్దం రాజు కృష్ణ ప్రసాద్, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం అంజీలను మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY