కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు 27వ.వర్ధంతి…..
సాక్షిత పెద్దపల్లి// ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ
దుద్దిల్ల శ్రీపాద రావు 27వ. వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో… స్థానిక గోదావరిఖని బస్టాండ్ ఎదురుగా గల శ్రీపాద రావు విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విచ్చేసి, శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి, వినమ్రంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ప్రజ కార్యకర్తలకు వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, శ్రీపాద రావు ప్రజాసేవలో చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించడం మన అందరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి , డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY