SAKSHITHA NEWS

నిజాయితీతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి దిశ నిర్దేశం చేసిన………………. ఎస్పీ రావుల గిరిధర్

సాక్షిత వనపర్తి
క్రమశిక్షణ నీతి నిజాయితీ అంకితభావంతో జిల్లా పోలీసు యంత్రాంగం విధులు నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలాచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఏఎస్ఐలకు హెడ్ కానిస్టేబుల్ లకు నిర్వహించినసమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ సమస్యలు బాధలతో మొదటగా వచ్చేది పోలీస్ స్టేషన్లకు ఆశ్రయించేది పోలీసులను అని అలాంటి బాధితులకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వారికి ఎలాంటి న్యాయం కావాలో అందిస్తూ రక్షణ కల్పిస్తూ వారి హక్కులను ఆత్మ గౌరవానికి భంగం కలవకుండా ప్రజల మన్ననలను పొందాలని పోలీసు ఉద్యోగం విధులు అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్నదని అధికారులు సలహాలు సూచనలు పాటిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తూ వృత్తిపరంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సై శివకుమార్ జిల్లాలోని ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app