SAKSHITHA NEWS

  • విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి కి న్యాయం చేయాలని.. స్కూల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన…………… విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమాన్యం పై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్,

స్పందించని యాజమాన్యం, జిల్లావిద్యాశాఖ అధికారులు

విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

సాక్షిత వనపర్తి
విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి హరీష్ కు స్కూల్ యాజమాన్యం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ పిడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ ఎదుటే ఉన్న రోడ్డుపై శనివారం బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కూల్ యాజమాన్య o సిబ్బంది నిర్లక్ష్యం వల్లే స్కూల్ పక్కన ఉన్న రైతు పొలంలోకి వెళ్లి విద్యుత్ షాక్ తో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హరీష్ శుక్రవారం ఉదయం ఐదు గంటలకు మృతి చెందాడని స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి నిండు ప్రాణం బలి కొందని విద్యార్థి మృతి చెంది ఎన్ని గంటలు అవుతున్న యాజమాన్యంపై కేసు నమోదు చేయడం అరెస్టు చేయడం కానీ చేయలేదని శవాన్ని మార్చరికి తరలించి చేతులు దులుపుకున్నారని పోలీసులపై విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులు యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకల రాకపోకలకు గంటల తరబడి అంతరాయం జరిగింది

ఇంత జరుగుతున్న స్కూల్ యాజమాన్యం కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ స్పందించకపోవడం దారుణమని వారు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులు స్పందించి సంఘటనపై విచారణ జరిపించి వెంటనే స్కూల్ యాజమాన్యంపై చట్టపురం మన చర్యలు చేపట్టి మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గంటల కొద్ది రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలకు ప్రయాణికులకు అంతరాయము జరుగుతోందని సంఘటనపై పంచనామ నిర్వహించేందుకు రోడ్డుపై ధర్నా తమకు అంతరాయం కలుగుతోందని కాబట్టి ఇక్కడ నుండి వెళ్లిపోవాలని తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలని పోలీసులు కోరినప్పటికీ విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగిస్తుండడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ విషయంపై వివరణ కోరేందుకు స్కూల్ యాజమాన్యం గాదే భాస్కర్ కు అలాగే రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డికి ఫోన్ చేసిన స్పందించకపోవడం విశేషం.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ బిజెపి ఏఐటీయూసీ పి డి ఎస్ యు సంఘాల నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS