SAKSHITHA NEWS

సాక్షిత :ఎన్డీఏ కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా

సాక్షిత : మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు ఎన్డీయే కూటమితో న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో టీడీపీ నాయకులు పల్లె పోగు ప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టినగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్,ఎమ్మార్పీఎస్ నాయకులు, ఎన్డీయే కూటమి నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
నాగుల్ మీరా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏ,బీ,సీ వర్గీకరణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నేత మందకృష్ణ మాదిగ చేసిన అనేక పోరాటాలకి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు కూటమినేతలందరం మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో మందకృష్ణ మాదిగ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ పై నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలందరం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

టిడిపి నాయకులు పల్లె పోగు ప్రసాద్ మాట్లాడుతూ మాల, మాదిగ అందరికీ సమాన న్యాయం చేసేలా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు అన్ని ఫలాలు అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షులు ఇసుకపల్లి చంటి, ముదిగొండ శివ, ముదిరాజ్ శివాజీ, ముళ్ళపాటి ప్రకాష్, చినబాబు, చుక్క నరేష్, బుదాల నంద కుమారి, ఆకారపు విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app