ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. ఉదండాపూర్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన ఫైలును రాబోయే కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఆమోదించాలని సీఎంను కోరిన అనిరుధ్ రెడ్డి.
• ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంత మంది ఇంటి నిర్మాణానికి పునాదులు వేసుకోగా అవి ఇందిరమ్మ యాప్ లో అప్ లోడ్ కాకపోవడం వల్ల వారికి బిల్లులు ఆగిపోయాయని, ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపడం జరిగిందని, ఇందిరమ్మ యాప్ లో ఉన్న సాంకేతిక సమస్యలు తొలగించి ఆ బిల్లులను సత్వరమే క్లియర్ చేయాలని..
• రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో తన తాత దేశ్ ముఖ్ పేరిట ఉన్న భూమిని రైతుల పేరిట మార్చడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపారని, వాటిపై వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అక్కడే ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి ని కోరిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
• ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
