జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గుంటూరు మేయర్ కావటి మనోహర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. మేయర్‌పై మండిపడుతున్న జనసేన నేతలుబేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చారు. అయితే మేయర్ కావటి మనోహర్ క్షమాపణ చెప్పకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి జనసేన పిలుపునిచ్చింది.
అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుడా జనసేన నేతల హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విధించిన రిమాండ్‌కు నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్ గుంటూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చంద్రబాబుకు మద్దతుగా జనసేన, ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో టీడీపీ బంద్‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.