SAKSHITHA NEWS

జనసేన సభ్యత్వం భవిష్యత్తుకు హామీ గ్రామ సర్పంచ్ చింతకాయల సూజాత*

అనకాపల్లి జిల్లా పరవాడ పరవాడ మండలం జనసేన పార్టీ నిర్వహించే సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి జీల్లా పంచాయతీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు,ముత్యాలమ్మపాలెం సర్పంచ్ ,జనసేన పార్టీ నాయకురాలు చింతకాయల సూజాత పిలువునిచ్చారు.శుక్రవారం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా గ్రామ సర్పంచ్ చింతకాయల సూజాత మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాలు నిత్యం సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళి రావడం అనేది ఒక సహాసం తో కూడిన జీవనాధారం నిత్యం ప్రమాదాలు జరుగుతునే వుంటాయి అందుకు గాను జనసేన పార్టీ సభ్యత్వం తో కూడిన బీమా సౌకర్యం వలన మత్స్యకారులు కుటుంబాలు ధీమగా వుండాలని సర్పంచ్ గారు తెలియజేశారు
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు ఆదేశాలు మేరకు ఈ నెల 18 నుండి,మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 28 వరకు జరుగుతుందన్నారు. 4వ విడత జన సేన క్రియాకీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొత్త సభ్యత్వనమోదుతో పాటు, సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం చేయడంజరుగుతుందన్నారు,సభ్యత్వం చేసుకున్న వారికి ఎటువంటి ప్రమాదం జరిగి మృతి చెందితే 5 లక్షల భీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి లో కీలక పాత్ర పోషించి డిప్యూటీ సీఎం పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులుగా భాద్యతలు స్వీకరించిన కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి మత్స్యకారులు ,ముత్యాలమ్మపాలెం దిబ్బపాలెం ,జాలారిపేట ,సమ్మంగిపాలెం తిక్కవానిపాలెం గ్రామాలు మత్స్యకారులు ,దళితలు జనసేన లోకి చేరుతున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో,తిక్కవానిపాలెం సర్పంచ్ చేపల మసేను జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 07 27 at 12.03.35

SAKSHITHA NEWS