నూతన వధూవరులను ఆశీర్వదించిన జనసేన నాయకులు
ముఖ్య అతిథిగా యువ నాయకులు మండలనేని చరణ్ తేజ
చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ముఖ్య అతిథిగా పాల్గొని, నూతన వధూవరులు పూజ మరియు శ్రీకాంత్‌లను ఆశీర్వదించారు.
26వ వార్డు, వడ్డెరపాలెం, లోని వధూవరుల స్వగృహము నందు ఈ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా చరణ్ తేజ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ తో పాటు అయ్యప్ప స్వామి, వెంకటప్పయ్య, వెంకటేష్, మునీర్ హసన్,సుభాని పలువురు జన సైనికులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
