జిల్లా ప్రకటనపై మదనపల్లెలో సంబరాలు

Sakshitha news

జిల్లా ప్రకటనపై మదనపల్లెలో సంబరాలు

** టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాటకొండమధు ఆధ్వర్యం

సాక్షిత ప్రతినిధి – మదనపల్లె / తిరుపతి: ఎన్నికల హామీలో చెప్పినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు బుధవారం సంబరాలు జరిపారు. ఇందులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు నేతృత్వం వహించి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ పాలనలో మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ గా అవతరించిన మదనపల్లెను అనేక సందర్భాలలో జిల్లా చేసేటువంటి అవకాశాలు వచ్చినా కొన్ని దుష్టశక్తుల పన్నాగం వల్ల మదనపల్లిని జిల్లా కాకుండా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రపంచంలోనే మదనపల్లికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి జిల్లాగా ప్రకటించారని తెలిపారు. మదనపల్లిలో ప్రపంచంలోనే మొట్టమొదటి టీబీ సెంటర్ ఏర్పాటు… రాయలసీమలోనే మొట్టమొదటి బీటీ కళాశాల నిర్మాణం…. మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్ ముంబై టు చెన్నై నేషనల్ హైవే లో ఉన్న మదనపల్లి పట్టణ వాసులు మంచికి, మానవత్వానికి, మర్యాదలకు మారుపేరుగా ఉంటారని పేర్కొన్నారు.

అదేవిధంగా మదనపల్లి బిటి కళాశాలలో విద్యనభ్య సించిన వాళ్ళలో నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అత్యున్నత పదవుల్లో కొనసాగారని గుర్తు చేశారు. ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామిక పిల్లలు మదనపల్లి పట్టణములో గల రిషీవ్యాళీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యను అభ్యసించిన వారే ఇలా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి మదనపల్లెను జిల్లా చేయడం మదనపల్లి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గం ఎంతో గర్వకారణం అన్నారు. మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు భాషా, తెలుగుదేశం నాయకులు నాగూర్ వలి ( షో ఆప్ శీన), జనసేన రాయలసీమ కన్వీనర్ రాందాస్ చౌదరి, బాస్ అధినేత పిటిఎం శివప్రసాద్, చందు పలు కమ్యూనిస్టు నాయకులు కృష్ణ మురళి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల మీద కేసులు పెట్టి ఉద్యమాలు అణిచివేసేటువంటి కుట్రలు జరిగినా కూడా మేము నిత్యం కోర్టు చుట్టూ వాయిదాలు చుట్టూ తిరిగాం… ఈవేళ మదనపల్లి జిల్లా చేయడము మా అందరికీ కూడా మా ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగివచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మదనపల్లి జిల్లా ప్రకటించడం శుభసూచకము. ఆయనకు మదనపల్లి నియోజకవర్గ కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకుల తరఫున అభినందనలు.

Scroll to Top