అల్పపీడన ప్రభావం అప్రమత్తంగా ఉండాలి జనం –
ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
అల్పపీడన ప్రభావ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ సూచించారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనిఅన్నారు.మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళవద్దని అన్నారు.మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. బాపట్ల నియోజకవర్గంలో అనేక చోట్ల పిడుగుల ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
భారీ వర్షాలకు ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని నరేంద్ర వర్మ అన్నారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించి సురక్షిత ప్రాంతాలు దాటి బయటకు రావద్దని అన్నారు. అన్ని విధాల ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.