
జనసేన యువ నాయకులు మండలనేని చరణ్‌తేజ సంక్రాంతి శుభాకాంక్షలు
చిలకలూరిపేట:
పాడిపంటలు, సుఖశాంతులతో ప్రజలు తులతూగాలని జనసేన పార్టీ యువనాయకులు మండలనేని చరణ్‌తేజ కాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పండుగలు మన వారసత్వ ప్రతీకలని. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత విలువ ఇచ్చే తెలుగు ప్రజలు నిత్యం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన అభిలషించారు.కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ సంవత్సరం రాష్ట్రంలో నిజమైన సంక్రాంతి శోభ కనిపిస్తోందన్నారు. ఊరూరా చేసిన అభివృద్ధి పనులు, పంట దిగుబడులతో రైతుల కళ్లలో, లోగిళ్లలో నిజమైన సంతోషాలు వెల్లివిరిస్తున్నాయన్నారు.
