జగిత్యాల అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా గురుపూజోత్యవ్
ఉపాధ్యాయుల ద్వారానే సమాజంలో అభివృద్ధి జరుగుతుందని మరియు శ్రేయస్సుకు మార్గం దొరుకుతుంది. తద్వారా ఆదర్శంగా జీవనాన్ని కొనసాగించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక జగిత్యాలలోని శివవీధి, కృష్ణానగర్, విద్యానగర్ మరియు మల్యాల క్రాస్రోడ్స్ లోని అల్ఫోర్స్ పాఠశాలల్లో వేడుకగా నిర్వహించినటువంటి అల్ఫోర్స్ గురుపూజోత్సవ్ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు వారు ప్రాంగణాలల్లో ఏర్పాటు చేసినటువంటి డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలిని ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ద్వారా సమాజాన్ని చాలా గొప్పగా రూపొందించవచ్చని మరియు వారి సూచనలు చాలా విలువైనవని అభిప్రాయపడుతూ ఉపాధ్యాయులు ఓపిక, సహనం, ప్రేమ ఆప్యాయతలకు గొప్ప నిర్వచనమని చెప్పారు.
ఉపాధ్యాయులవి గురువులుగా కొలవడం మనదేశంలో చాలా గొప్ప సాంప్రదాయమని తెలుపుతూ వారు చేసే కృషి వెలకట్టలేనిదని తెలుపుతూ ఉపాధ్యాయులని ఆరాధించిన వారు చాలా విషయాలలో పట్టు సాధించడమే. కాకుండా సంచలనాలు సృష్టిస్తారని చెప్పారు. “భారతరత్న” డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పరిపాలన దక్షకునిగా ఖ్యాతి చెందారని చెప్పారు. దేశ ప్రపధను ఉపరాష్ట్రపతిగా మరియు రెండో రాష్ట్రపతి గా విశిష్ట సేవలనందించి దేశానికి ఎనలేని కీర్తి తీసుకొచ్చారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని మరియు సవాళ్ళతో ఉన్నదని తెలుపుతూ వారి తెలివితో విషయ పరిజ్ఞానంతో చాలా సులభంగా పరిష్కరిస్తారని. వారు చెప్పారు. విద్యార్థుల అభ్యున్నతికై కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు. మరియు ఉపాధ్యాయులందరు డా॥వి. నరేందర్ రెడ్డి గారిని చాలా గొప్పగా సత్కరించి వారి పట్ల అభిమానాన్ని మరియు ఆప్యాయతను చాటారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.