SAKSHITHA NEWS

లబ్ధిదారులకు ఎల్వోసి లు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సాక్షిత : జగిత్యాల పట్టణ 39వ వార్డు వాణి నగర్ కు చెందిన ఎం శ్రీనివాస్ S/o బ్రహ్మయ్య తుంటి ఎముక సమస్య తో బాధపడుతూ ఉండగా స్థానిక నాయకులు సమిండ్ల శ్రీనివాస్ వారి ఆర్థిక పరిస్తితి గురించి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువ గల ఎల్ఓసిని శ్రీనివాస్ కు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందజేసిన శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .

జగిత్యాల పట్టణ 13వ వార్డు సలేమా గార్డెన్స్ కు వాడ కు చెందిన మహమ్మద్ ఆసిఫ్ S/o మహమ్మద్ సత్తార్ నేత్ర సంబంధిత నరాల సమస్య తో బాధపడుతూ,శస్త్ర చికిత్స చేసుకొనే ఆర్థిక పరిస్తితి లేక ఇబ్బంది పడుతూ ఉండగా స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 2 లక్షల 65 వేల రూపాయలు విలువగల ఎల్ఓసి నీ జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆసిఫ్ కు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ..

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోడ్ల జగదీష్,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు ధూమాల రాజ్ కుమార్,యం ఏ షకీర్,ఫిరోజ్, జమీల్,తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2024 08 21 at 17.23.11

SAKSHITHA NEWS