SAKSHITHA NEWS

రాష్ట్రానికి జగన్ విఘ్నాలు తొలగాలి… అభివృద్ధి మెరవాలి

శ్రీ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్

రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా జగన్ రెడ్డి విఘ్నాలు తొలగి అభివృద్ధిలో పరుగులు తీయాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు . నంద్యాల స్థానిక గాంధీ చౌక్ నందు ఏర్పాటుచేసిన శ్రీ గణేష్ నిమజ్జనోత్సవ కమిటీ వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది . అంతకుముందు భవనాసి జువెలర్స్ వారు అతిధులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవ నిమజ్జనోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు అలాగే 74 ఏళ్ల వయసులోనూ రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజల సమస్యలు తీర్చడం కోసం నవయువకుడిగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరింత శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని ఆ గణపయ్యను వేడుకుంటున్నామన్నారు . నంద్యాల స్థానిక గాంధీ చౌక్ నందు ఏర్పాటు చేసిన వినాయక వరసగా రావడంతో వారికి జ్ఞాపకను అందజేయడం జరిగింది . అంతేకాకుండా మళ్లొచ్చే ఉత్సవాల నాటికి ముఖ్యమంత్రి తలపెట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా ముందు కు సాగాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నామన్నారు . నంద్యాల నియోజకవర్గం ప్రజలకు ఏ లోటు రాకుండా చూడాలని, రైతులకు మంచి దిగుబడులు, యువతకు మంచి అవకాశాలను అందించాలని కోరుకున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు , తులసి రెడ్డి , గోపిశెట్టి నరసింహారావు , రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి , అశ్విని కుమార్ , గురురాజ విద్యాసంస్థల అధినేత దస్తగిరి రెడ్డి , గంగిశెట్టి విజయకుమార్ , చింతకాయల సుధాకర్ , ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధంశెట్టి రాజారామ్ , మామిడి నాగరాజు కుమార్ , హైగ్రీవ చారి , గోవిందు నాయుడు , కామిని మల్లికార్జున , చలం బాబు , సానిపల్లె సుదర్శన్ రెడ్డి , బాచం నాగేశ్వర్ రెడ్డి , రంగా పినాకపాణి , యక్కిల్లి సుబ్బారావు , ఆర్ల వెంకటస్వామి , వెంకటేశ్వరరావు , సెవెన్ హిల్స్ మారుతి కుమార్ , చందా చంద్రమోహన్ , చింత సుదర్శన్ రెడ్డి , కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ , అడగాళ్ళ కృష్ణమూర్తి , అవ్వరు గిరినాథ్ , తాళంకి ప్రవీణ్ కుమార్ (గోపి) , ముక్కుమల్ల వెంకటసుబ్బారెడ్డి , తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS