SAKSHITHA NEWS

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తక్షణమే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి……………….
బీఆర్ఎస్ యువ నాయకులు గాడిల అధ్విక్ డిమాండ్

నిరుద్యోగుల పేరు చెప్పుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం సిగ్గుచేటు.

…..

*సాక్షిత వనపర్తి :
అలంపూర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసాం అని అనడం హాస్యపదం.
గత ప్రభుత్వంలో కెసిఆర్ భర్తీ చేసిన 60 వేల ఉద్యోగులను మా ప్రభుత్వమే భర్తీ చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటు.
కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఎన్నికల వేళలో రిజల్ట్ ను వెయిటింగ్ లో పెట్టడం వల్ల ఆ రిజల్ట్ ఆగిపోయింది. ప్రభుత్వ మారింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి దాన్ని కూడా మేమే భర్తీ చేశామని అనడం ఎంతవరకు సమంజసం, అంటే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకోవడంలో కాంగ్రెస్ దిట్ట అని అన్నారు.

మీ చేతగానితనంతో ఇంతవరకు విద్యా శాఖ మంత్రిని నియమించలేదు. విద్యా శాఖకు మంత్రి లేకుంటే విద్యా వ్యవస్థ పైన ఎట్ల రివ్యూ చేస్తారని ఆయన ప్రశ్నించారు
గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ది.

మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు అయితే కూడా ఇంతవరకు ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఉద్యోగాలపేరు మీద నిరుద్యోగులను మోసం చేసి జాబ్ క్యాలెండర్ను జోకు క్యాలెండర్ గా మార్చారన్నారు .

ఐటి మంత్రి కు సోయీ ఉంటే రాష్ట్రానికి ఐ ఐ ఎం, ఐ ఐ టి, ఐ ఐ ఎస్ ఈ ఆర్, ఐ ఐ ఐ టి, ఎన్ ఐ డి, మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయలను తీసుకురావాలని

ఐటీ రంగంలో పెట్టుబడి తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు .

కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి లక్షలలో పెట్టుబడులు మరియు 30 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగులు కల్పించిన ఘనత గత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ది

అబద్ధపు మాటలతో పాలన సాగించలేరు ఇకనైనా నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తక్షణమే విద్యార్థుల యొక్క బకాయిలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన 6,500 కోట్ల బడ్జెట్ను విడుదల చేసి ఆ విద్యార్థులను ఆదుకోవాలి. లేకుంటే ప్రైవేటు రంగ సంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఎందుకంటె టీసీలు, మెమో లు ఇవ్వక మరియు ఇయర్ ఫీజుల విషయం లో చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తక్షణమే స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS