femaleప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా?
female మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ రసాభాస.
ప్రొటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయించడంపై మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కామెంట్స్
ప్రభుత్వ నుండి వచ్చే కార్యక్రమమైనా పార్టీ పరంగా చేస్తాం ఓడిపోయిన వ్యక్తుల చేతనే కార్యక్రమాలను నిర్వహిస్తామని ఒక చట్టం తీసుకొస్తే తమకేమీ ఇబ్బంది లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
గెలిచిన వ్యక్తులు అంటే గౌరవం లేకుండా రాజకీయ జెండాగానే పాలన నడిపిస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
రాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడిలు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్లు మూసుకొని పాలన కొనసాగిస్తుందని ఆమె విమర్శించారు.
నిరుద్యోగులంతా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదని ప్రశ్నించారు.
ప్రజా ప్రతినిధుల గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుందని, స్పీకర్ ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app