SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మళ్లీ నిరాశేనా?

న్యూఢిల్లీ :
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలు లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్ అవెన్యూకోర్టులో విచారణ జరగనుంది.

కవితను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్‌ ఇవ్వా లన్న పిటిషన్‌ను గతంలోనే ట్రయల్‌ కోర్టు కొట్టివేసింది.

ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేయగా అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్‌ కోర్టులోనే మళ్లీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీన్ని జూలై 22న విచారిం చిన ట్రయల్‌ కోర్టు జడ్జి కావేరి బవేజా.. కేసును ఇవాళ్టికి వాయిదా వేశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఇప్పటికే కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి పలువురు బీఆర్ఎస్‌ నేతలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ కానున్నారు…

WhatsApp Image 2024 08 05 at 10.45.44

SAKSHITHA NEWS