SAKSHITHA NEWS

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మీడియాకు అందని ఆహ్వానం

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ ఫెర్ లో మీడియాకు ఘోర అవమానం జరిగింది. ప్రదర్శన లు చూయించాల్సింది మీడియానే, ఎవరూ ప్రారంభించారు?,ఎవరెవరు వచ్చారు?, ఎంతమంది ప్రదర్శనలో పాల్గొన్నారు?, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏమి ప్రదర్శించారు?, ఏర్పాట్లు ఎలా వున్నాయి? అనే విషయాలను గుర్తించి, ప్రచురించాల్సిన మీడియాను అధికారులు పక్కన పెట్టేసారు. అదేంటో అర్థం కాలేదు.వాళ్ళతో మాకేం పని అనుకున్నారా?, లేక వాళ్లకు మేమేంటి చెప్పడం అనుకున్నారో తెల్వదు కానీ జిల్లాస్థాయి ప్రదర్శనకు ఓ మీడియా కమిటీని పెట్టినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం ఇవ్వాల్సిన మీడియా కో ఆర్డినేటర్, మీడియా టీమ్ దిక్కు దివాన లేకుండగా సమాచారం ఇవ్వకపోవడం, కొందరికి మాత్రమే సమాచారం ఇచ్చి మిగతా వారిని మరచిపోయారేమో మరి.


SAKSHITHA NEWS