SAKSHITHA NEWS

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో.. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళామణులు

మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ లోని ఎంజేఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో పురుషుడితో సమానంగా మహిళలూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మహిళా ఆత్మస్థైర్యంతో ఎంతటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకుపోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందని.. సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం గౌరవ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS