SAKSHITHA NEWS

సమీకృత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేపట్టాలి..
-పెండింగ్ ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను సోమవారం లోగా పరిష్కారం చెయ్యాలి
-2025 ఏస్ ఎస్ ఆర్ ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం
-సాగులో లేని 15 వేల హెక్టర్ల భూమి వివరాలు సర్వే నెంబర్ వారీగా సర్వే చేపట్టాలి

  • జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, సాక్షిత :

సీసీఆర్సి కార్డులు , సమీకృత ధృవ పత్రాలు జారీ , పి.జీ.ఆర్.ఎస్., అర్జీలు పరిష్కారం, ఎస్.ఎస్.ఆర్ – 2025 ఓటరు జాబితా పనులు చేపట్టడంలో, సాగులో లేని భూముల క్షేత్ర స్థాయిలో సర్వే పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి సమీకృత కుల ధ్రువపత్రాలు , సిసిఆర్సి కార్డులు , పి.జీ.ఆర్.ఎస్., అర్జీలు పరిష్కారం , ఎస్.ఎస్.ఆర్ – 2025 ఓటరు జాబితా పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోమవారం నాటికి నూరు శాతం పరిష్కారం చేయాలని ఆదేశించారు. 187 పెండింగ్ అర్జీలలో రెవెన్యు 158, ఇతర శాఖలు 29 ఉన్నాయన్నారు. కడియం మండలంలో 67, ఆర్డీవో రాజమండ్రి 37, బిక్కవోలు 16, కోరుకొండ 12 ఉన్నాయన్నారు. భూ సమస్యలు, సమీకృత కుల ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర వాటికి చెందినవి ఉన్నాయన్నారు. వాటికి చెంది అర్జి వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిష్కారం చేసి సోమవారం ఉదయం ఎటువంటి పెండింగ్ లేకుందా చూడాలని పేర్కొన్నారు.
మండల స్థాయిలో ప్రతి నెల నాలుగో శనివారం ” పౌర హక్కుల సేవా రోజు ” నిర్వహించాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఆమేరకు మండల స్థాయిలో ఆయా కమిటి సభ్యులను, పోలీసు అధికారులను , ఇతర సమన్వయ అధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను కలుపుకుని వెళ్ళేలా ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రానున్న నెలలో ఎస్.సి., ఎస్టీ కమిషన్ కమిటి జిల్లా పర్యటన నేపధ్యంలో విజిలెన్స్ కమిటి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం అయ్యే దిశలో కుల ధ్రువీకరణ పత్రం కోసం 10 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సి గా ఆదేశించారు. పీ వో ఏ యాక్ట్ అమలు చేసే విధానం మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు.

స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 కి అనుగుణంగా ఆగస్టు 28 నుంచి బిఎల్వోలు ఇంటింటి సర్వే చేపట్టి ఓటర్ జాబితాను సవరణ చేయాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వారీగా బిఎల్వో లను నిర్ధారించుకుని, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి వాటినీ మెడికల్ లీవు, బదలీలు, గుర్తించి నియోజక వర్గ ఎలెక్టోరల్ అధికారి నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఫోటో గుర్తింపు లేనివి, ఒకే డోర్ నెంబర్ లో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నవి, పేరు మార్పు అయిన పోలింగ్ కేంద్రాల, ఓటర్ల సంఖ్య ఆధారంగా హేతుబద్ధత కలిగి ఉండేలా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. సార్వత్రిక ఎన్నికలలో కమిషన్ రూపొందించిన మార్గదర్శకా లకు అనుగుణంగా ఎస్ఎస్ఆర్ 2025 చేపట్టాల్సి ఉందన్నారు. బి ఎల్ వో లు నియామకంలో దివ్యాంగులని నియమించ రాదన్నారు. ఓటరు జాబితా లో హేతుబద్ధత కలిగి ఉండాలని, నిరాకరణ కు చెందిన వాటి రికార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
సి సి ఆర్ సి నమోదు పూర్తి చెయ్యాలని, జిల్లాలో ఇప్పటి వరకు 1,౦4,622 రైతుల వివరాలు నమోదు చేయగా, ఇంకా రాజమండ్రి రాజమహేంద్రవరం 546 , కోరుకొండ 472 , బిక్కవోలు 427 మంది రైతుల వివరాలు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, పెండింగ్ కు కారణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో సాగు భూములలో సాగు కింద రాని సుమారు 15 వేల హెక్టార్ల విస్తీర్ణం ఉందని, వాటిని గ్రామాల వారీ సర్వే నెంబర్ వారీగా గుర్తించి వాటి యదార్థ స్థితి పై సమగ్ర వివరాలు అందచేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో క్షేత్ర స్థాయి నుంచి డివిజన్ మండల కేంద్రాల నుంచి సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్డిఓ కె ఎల్ శివ జ్యోతి, తాహసిల్దార్లు , ఎలక్షన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు, జిల్లా రెవెన్యు అధికారి జి నరసింహులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి పి. పాపారావు, కలక్టరేట్ సూపరింటెండెంట్ లు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS