మెప్మా కార్యాలయంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయండి.
మహిళా మార్ట్ లిఫ్ట్ మరమ్మత్తులు చేపట్టండి.
నగరంలోని మహిళలకు అండగా ఉన్న పట్టణ పేదరిక నిర్మూలన కేంద్రం (మెప్మా) లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల మెప్మా కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, కృష్ణాపురం ఠాణా వద్ద గల మహిళా మార్ట్ ను మధ్యాహ్నం కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెప్మా కార్యాలయం వద్ద అపరిశుభ్రత, మహిళా మార్ట్ వద్ద లిఫ్ట్ మరమ్మత్తులు చేయకపోవడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మెప్మా కార్యాలయం కు పెద్ద సంఖ్యలో మహిళలు వస్తుంటారని, వారికి మౌళిక వసతులు కల్పించాలని కోరారని అన్నారు. ఈ మేరకు తనిఖీ చేశామని అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అలాగే చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించామని అన్నారు. మహిళా మార్ట్ వద్ద లిఫ్ట్ మరమ్మత్తులకు గురి కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈ లిఫ్ట్ ను పరిశీలించాలని, త్వరగా మరమ్మత్తులు చేయించాలని అధికారులను ఆదేశించామని అన్నారు.
కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డి.ఈ. మధు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, సూపరింటెండెంట్ సుధాకర్, శ్రీనాథ్ రెడ్డి, సిఎంఎం కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.