inspiration దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి…….. జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి
*సాక్షిత వనపర్తి :
inspiration దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అయిన దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి అన్నారు.
బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఐ.డి.ఒ.సి. ప్రాంగణంలో నిర్వహించగా జడ్పి చైర్ పర్సన్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి దొడ్డి కొమరయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నిజాం నవాబుల ఆగడాలకు విరుద్ధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తొలి అమరుడు అయ్యాడని గుర్తు చేశారు. నవాబుల కాలంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేదని రైతులు, మహిళలపై నవాబు కాలంలో జరిగిన అన్యాయాలను అడ్డుకొని తన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
భారత దేశంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు మంచి పరిపాలన అందిస్తున్నాయని, ఇటీవలే కేంద్రప్రభుత్వం క్రిమినల్ చట్టాలను సవరించి కొత్త సీఆర్ పిసి, ఐ.పి సి చట్టాలను అమలులోకి తెచ్చిందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసిన వీరులను ఎప్పటికీ మరచిపోవద్దనీ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం, దేశం అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు.
బి సి సంక్షేమ శాఖ అధికారి సుబ్బా రెడ్డి, జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు నాగరాజు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app