SAKSHITHA NEWS

inquiry on MLC Kavitha's bail petition

ఢిల్లీ మద్యం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది.

రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వను న్నారు. లిక్కర్ ఈడి సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించా రు. ఈడి, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిసాయి.

దీంతో ఇవాళ కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించ నున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15 న కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తిహాడ్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11 న సీబీఐ అరెస్ట్ చేసింది.

కాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడి, సీబీఐ కేసులో కవిత బెయిల్‌ కోసం గత నెల 22న రౌస్‌ అవె న్యూ, కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే 2కు తీర్వు రిజర్వు చేశారు.

అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావిం చగా.. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మే 6కు రిజర్వ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరి స్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఒకవేళ కవితకు బెయిల్‌ లభిస్తే జ్యుడీషయల్‌ రిమాండ్‌ నుంచి మినహా యింపు లభిస్తుంది. బెయిల్‌ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం.. కవిత ను కోర్టులో హాజరుపరు స్తారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

Inquiry on MLC Kavitha's bail petition

SAKSHITHA NEWS