SAKSHITHA NEWS

CM కప్ 2024 లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ 2024 స్విమింగ్ మొదటి రోజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి , , తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ,తెలంగాణ అసోసియేషన్ స్విమింగ్ సెక్రెటరీ ఉమేష్ , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ CM కప్ 2024 లో భాగంగా తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్విమింగ్ పోటీలు నిర్వహించడం చాలా అభినందనియం అని , స్విమ్మింగ్ మంచి వ్యాయమం అని ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ,క్రీడాకార్లుల్లో దాగిన శక్తి ని వెలికితీసి వారి ప్రతిభాపాటవలతో అత్యున్నత స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా స్విమ్మింగ్ పోటీలు తొడుపడుతాయి అని, జాతీయ,అంతర్జాతీయ వేదికలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పథకాలు సాధించి దేశం పేరు మన ప్రాంతం పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ,స్విమ్మింగ్ వలన దేహ దారుడ్యం లభిస్తుంది అని , శారీరక శ్రమ తో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది అని,స్విమ్మింగ్ పోటీలు నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS