SAKSHITHA NEWS

ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌
…..

సాక్షిత :+ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు లోకసభలో పలు అంశాలపై ఆయన ప్రశ్నలు వేశారు. పిడబ్ల్యూసి సర్వే ప్రకారం దేశం ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారిందన్న విషయం వాస్తవమేనా అని ఆరా తీశారు. అయితే 2020లో 4వ స్థానం నుండి 2022లో 5వ స్థానానికి, 2023లో 9వ స్థానానికి పడిపోయిన కారణంగా ప్రభుత్వం ఈ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి, ఈ ర్యాంకును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విధానపరంగా తీసుకుంటున్న చర్యలు, అదనపు మూలధన వ్యయం, దేశీయ డిమాండ్ ఈ విషయంలో ఎంత వరకు సహాయపడతాయో తెలియజేయాలని కోరారు.ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పిడబ్ల్యూసి 27వ వార్షిక గ్లోబల్ సర్వే ప్రకారం, భారతదేశం ప్రపంచంలో 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారిందన్నారు. అయితే, ప్రైవేట్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు, ఇతర ప్రపంచ సంస్థలు ఎప్పటికప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై తమ సొంత అంతర్గత పరిశోధనలను ప్రచురిస్తాయని, భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని సూచించవని తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app