మూడు చింతలపల్లిలో నూతన ఎమ్మార్వో కార్యాలయ ప్రారంభం–ముఖ్య అతిథిగా చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ,తోటకూర వజ్రేష్ యాదవ్
మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూడు చింతలపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మార్వో కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ,టిపిసిసి అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభంతో ప్రజలకు భూ సంబంధిత సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి మాజీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, ఆర్టీఏ మెంబెర్ భీమిడి జైపాల్ రెడ్డి, గ్రంధాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎ బ్లాక్ అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి,మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, గోన మహేందర్ రెడ్డి ,మరియు స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
