SAKSHITHA NEWS

ఈనెల 25న వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవం.
ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.


సాక్షిత : సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని గీత విద్యాలయం గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్, ఆవాస భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. నూతన భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను వాల్మీకి ఆవాస ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ భీమనాత్ని శంకర్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా గ్రామీణ, నిరుపేద నిరాశ్రయ బాలల కోసం వాల్మీకి ఆవాస విద్యాలయాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇంతకాలం సొంత భవనం లేకపోవడంతో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా సమాజంలోని అనేకమంది దాతల సహకారంతో నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. నూతన భవనం ప్రారంభోత్సవానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీలు టి.జీవన్ రెడ్డి, ఎల్, రమణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, తోపాటు సేవా భారతి అఖిలభారత అధ్యక్షులు పన్నాలాల్ బన్సాలి, క్షేత్ర సేవ ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్,రాష్ట్ర కార్యదర్శి రామ్మూర్తి, శ్రీ వేణుగోపాలచార్య కౌశక, డాక్టర్ శరత్ తోపాటు ఆవాస శ్రేయోభిలాషులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి విద్యార్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాస అధ్యక్ష, కార్యదర్షులు జిడిగే పురుషోత్తం, మదన్మోహన్రావు, కమిటీ సభ్యులు అశోకరావు, సంపూర్ణ చారి, టీవీ సూర్యం, శ్రీనివాస్, వెంకటేశ్వర్రావు,హరీష్,నరసింగరావు, కైలాసం, గుండా సురేష్, ఆవాస ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 20 at 18.31.27

SAKSHITHA NEWS