SAKSHITHA NEWS

శంకర్‌పల్లిలో కిండర్ కేర్ చిల్డ్రన్స్ క్లినిక్ ప్రారంభం

సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి: చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి: ఆగస్టు 30:ఆసుపత్రికి వచ్చే రోగులకు లాభాపేక్షతో కాకుండా సేవాదృక్పథంతో మెరుగైన వైద్యసేవలు అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్‌పల్లి పట్టణ పరిధిలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్ కేర్ చిల్డ్రన్స్ క్లినిక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ ప్రాంతానికి రకరకాల ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్టార్ కూడా విస్తరిస్తుందని, అటు వంటి అద్భుతస్థాయి అవకాశం శంకర్‌పల్లి కి ఉందన్నారు. పిల్లలకు, పెద్దలకు అందుబాటులో అత్యాధునిక సౌకర్యాలతో క్లినిక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్లినిక్ యాజమాన్యం డాక్టర్ రవళి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే.. డాక్టర్ రవళిని అభినందించారు. డాక్టర్ రవళి మాట్లాడుతూ క్లినిక్ లో పుట్టిన పిల్లల నుండి పెద్దల వరకు చికిత్సలు చేస్తామన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్, పిల్లల పెరుగుదల వంటి చికిత్సలన్ని క్లినిక్ లో అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, కౌన్సిలర్స్ శ్వేతా పాండు రంగారెడ్డి, చంద్రమౌళి, నాయకులు గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్, కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, విజయ్, సత్తిరెడ్డి, భాస్కర్ ఆసుపత్రి సిబ్బంది, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS