
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత!
హైదరాబాద్:
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన, హైదరాబా ద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
అల్లరి నరేష్ తో ‘మడత కాజా’, ‘సంఘర్షణ’ వంటి చిత్రాలను నిర్మించారు వేదరాజు టింబర్. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కన్‌స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించారు.
త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో నే ఈ విషాద సంఘటన జరిగింది. గత కొంతకా లంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యం తో ఆయన చికిత్స తీసు కుంటున్నారు.
త్వరలోనే కోలుకుని వస్తారని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు ఈ రోజు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app