హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లో రూ.35 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .
సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి, కాలనీ వాసులు వెంకట రత్న కుమార్, రాంబాబు రాజు, డిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.