రంగారెడ్డి నగర్ 281 డివిజన్ లోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ ….
కూత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని రంగారెడ్డి నగర్ డివిజన్ ( గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలొ) స్థానిక కాంగ్రెస్ నాయకుడు మోతే శ్రీనివాస్ తన సొంత నిధులతో ఏర్పాటుచేసిన నూతన మంచి నీటి శుద్ధి యంత్రాన్ని ( మినీరల్ వాటర్ ప్లాంట్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు……
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు, అదేవిధంగా పాఠశాలలో కావలసిన మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు…
ప్రభుత్వ పాఠశాలలో ఈ మంచినీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు మోతే శ్రీనివాస్ యాదవ్ గారిని శ్రీనివాస్ గౌడ్ అభినందించారు…
అనంతరం నిర్వాహకులు కూన శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో సత్కరించారు..
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ స్థానిక నాయకులు బండారు నారాయణ, రమేష్ గరిగే, రమేష్ మంజుల్కర్, తిమ్మయ్య, షాకీర్, శ్యామల, ప్రభాకర్ రెడ్డి, ఎరువ వెంకట్, రమణారెడ్డి, బాలరాజ్, చౌడ శ్రీనివాస్, నాగిళ్ల శ్రీనివాస్, రాకేశ్ ,రిజ్వాన్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY