SAKSHITHA NEWS

ఎలమంచిలి నియోజకవర్గంలో ఏటికొప్పాక.పంచాయతీలో ఘనంగా మొదలైన పల్లె పండుగ

అనకాపల్లి జిల్లా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్డీఏ కుటుంబ నాయకులు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు సర్పంచుల నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు..ఏటికొప్పాక పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమంలో 17 లక్షల రూపాయలతో వాల్ సిసి రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కామెంట్స్.పల్లె పండుగ పేరుతో 14 వ తారీకు నుండి 20వ తారీకు వరకు పల్లె వారోత్సవాలు ఘనంగా జరపాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులతో ఈ వారం రోజులు ప్రతి పల్లెలో కనపడుతుంది.గ్రామీణ ఉపాధి హామీ పథకం మ్యాచింగ్ గ్రాండ్స్ తో 4500 కోట్ల తో ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు పల్లె పండుగ కార్యక్రమానికి ఇస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిలకు ధన్యవాదములు.ఎలమంచిలి నియోజకవర్గంలో మండలంలో 54 గ్రామాలలో 80 పనులకు గాను నాలుగు కోట్ల 46 లక్షల రూపాయలతో ఈ ఏడు రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటాయి.ఎలమంచిలి నియోజకవర్గంలో ఏటికొప్పాక గ్రామంలో పంచాయతీలో ప్రారంభించారు మరియు మొదటిరోజు ఎనిమిది గ్రామాలలో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు జనసేన టిడిపి బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS