మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజల జీవనప్రమాణాల పెంపు : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
132 – జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ లోని వుడ్స్ ఎంక్లేవ్ నందు దాదాపు 90.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..మౌలిక వసతుల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు ద్వారానే అభివృద్ధి సాధ్యమని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా జీడిమెట్ల డివిజన్ తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి, వుడ్స్ ఎంక్లేవ్ ప్రెసిడెంట్ శివరామ కృష్ణ, జనరల్ సెక్రెటరీ తోట భిక్షపతి, ట్రెజరర్ నర్సింహా రెడ్డి, కమిటీ సభ్యులు ఉదయ్, శ్రీహరి రెడ్డి, సురేష్, రాజేందర్ రెడ్డి, పాండురంగ, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, బిఆర్ఎస్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, కాలే గణేశ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
