భ్రమరాంబిక నగర్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
▪️ ఐక్యత, ప్రేమకు ఏసుక్రీస్తు బోధనలు మార్గదర్శకం : కాట శ్రీనివాస్ గౌడ్
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని భ్రమరాంబిక నగర్ కాలనీలో ఐపీసీ హెర్మోన్ ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరసోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ, కరుణ, క్షమ అనే విలువలతో సర్వమానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తే సమాజంలో శాంతి, ఐక్యత వెల్లివిరుస్తాయని అన్నారు.

