ప్రభుత్వంగ్రామపంచాయతీ కార్మికులకు-ఇచ్చిన హామీలు అమలు చేయాలని….. గ్రామ పంచాయితీ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సమ్మె
- జీవో నెంబర్ 51 సవరించి జీవో నె. 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరిక
సాక్షిత వనపర్తి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల కు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గ్రామ పంచాయతీ సంఘాల జేఏసీ ఇచ్చిన రెండు రోజుల సమ్మె పిలుపుమేరకు
వనపర్తి జిల్లా కేంద్రంలో. శనివారం మర్రికుంట పాలకేంద్రం నుండి భారీ ర్యాలీగా పాత కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరంసభను నిర్వహించడం జరిగింది. సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు. టి యు సి ఐ జిల్లా నాయకులు గణేష్ లు అధ్యక్షత వహించడం జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు. ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి అరుణ్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ
. గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని గ్రీన్ చాలన్ ద్వారా వేతనాలు చెల్లించాలని
. రెండవ పిఆర్సి పరిధిలోకి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావా లి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలి
జీవో నెంబర్ 51ని సవరించాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి
పాత కేటగిరి లన్నింటిని కొనసాగించాలి కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిలు గానీ నియమించాలి అర్హులైన సిబ్బందిని ప్రమోషన్లు కల్పించాలి
. పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలి ఇన్సూరెన్స్ ఈఎస్ఐపి సౌకర్యం కల్పించాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని
పంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలి
ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి నేరుగా వారికి కూడా వేతనాలు చెల్లించాలి పంచాయతీల అవసరాల ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెంచాలి
. కార్మికులందరికీ ఇందిరమైన్లు ఇండ్ల పథకాలు కేటాయించాలి
చనిపోయిన అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి.
ప్రభుత్వం స్పందించకుంటే నిర్వాదిక సమ్మెకుల వెనుకడుగు వేయమని నేతలు హెచ్చరించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉద్యోగ jac జిల్లా నాయకులు బొబ్బిలి నిక్సన్. ఏదుట్ల పురుమయ్య. సుబ్బయ్య. కరీం. హనిప్. శ్రీను. దాసు. ఎల్లయ్య. పుష్ప. మధు. గోవిందమ్మ. నరేష్. జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు