SAKSHITHA NEWS

ఇంట్లో వాడని పాత వస్తువులు ఉంటే ఆర్ఆర్ఆర్ సెంటర్ లో ఇవ్వండి: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్


సాక్షిత శంకర్‌పల్లి : ఇంట్లో వాడని పాత వస్తువులు ఉంటే ఆర్ఆర్ఆర్ సెంటర్ లో ఇవ్వాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలో ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్, రీ యూస్, రీసైకిల్) సెంటర్ వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్తను తగ్గించాలని, ప్లాస్టిక్ ను వినియోగించకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రకృతిలో కలిసిపోయే వాటినే వినియోగించాలని, చెత్తను వేరు చేసి తిరిగి ఉపయోగించడం రీసైకిల్ చేయడం అనగా కంపోస్ట్ మొదలగునవి చేయుటకు ప్రతి ఇంట్లో అనవసరంగా ఉన్న వస్తువులను, పుస్తకాలను, చెప్పులు, బెల్టులు, బట్టలను రోడ్లపై పడేయకుండా ఆర్ఆర్ఆర్ సెంటర్ లో ఇచ్చినట్లయితే పేద ప్రజలకు ఉపయోగపడతాయని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మెప్మా ఆర్ పి లు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS