
నీకు దమ్ముంటే మా ఇంటి గేట్ టచ్ చేసి చూడు..
నా మీద పోటీ చేసి గెలిచే దమ్ము నీకుందా..ఇదే నా సవాల్..
ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది..
నా రాజీనామాను ఆమోదించకుండా అధికారులను బెదిరించింది మీరు కాదా…?
— జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి
రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పై ఆరోపణలు చేసిన మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..
కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన బత్తుల వెంకటలక్ష్మి జక్కంపూడి రాజా ఆరోపణలు అన్నీ అవాస్తమని.. అవన్నీ బూటకపు కబుర్లు అని ఎద్దేవా చేసారు.. అలాగే గత ప్రభుత్వ విధానాలు నచ్చక నేను నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తే దానిని ఆమోదించకుండా అధికారులను భయబ్రాంతులకు గురిచేసి నా రాజీనామాను ఆమోదించకుండా మీ అధికారం చూపించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా రాజీనామాను ఆమోదించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసారు..
మమ్మల్ని విమర్శించడానికి మీకు వేరే విషయాలు దొరక్క ఎప్పుడూ నా ఎంపీటీసీ పదవి గురించి మాట్లాడుతున్నారు..మేము నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళు తెరిచి చూడండి..మీరు 5 సంవత్సరాలలో చేయనిది మేము 8 నెలల కాలంలో చేసి చుపించాము.. ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం.. ఎటువంటి రాజకీయ చరిత్ర లేని మా మీద నువ్వు దారుణంగా చిత్తుగా ఓడిపోయావ్ అది మర్చిపోకు.. ఎంపీటీసీ భర్త పోటీ చేస్తేనే 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయావంటే నేను పోటీ చేస్తే 50 వేల ఓట్లతో ఓడిపోతావ్.. ఈ సారి నేను నిలబడతాను.. నీకు దమ్ముంటే నా మీద గెలిచి చూపించు అంతే గాని తొందరపడి వాగ్దానాలు చేయకు ఎందుకంటే నువ్వు ఇచ్చిన మాట, వాగ్దానం మీద నిలబడే వ్యక్తివి కావు నువ్వు.. మొన్న మాటల్లో నేను రాజకీయం చేయలేదు అని చెప్పావ్.. నువ్వు రాజకీయం చేయకుండానే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి పేర్ల మీద ఆరుగురు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టావ్.. వాళ్ళకి సుమారు 15 వేల ఓట్లు పడ్డాయ్ ..ఆ విధంగా చూసుకుంటే నువ్వు 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయావ్ అది మర్చిపోకు… ఎన్నికల సమయంలో జగన మోహన్ రెడ్డి రెండు చోట్లకు మాత్రమే ప్రచారానికి వెళ్లారు… ఒకరి పిఠాపురం, రెండు రాజానగరం… నువ్వు ఓడిపోతావ్ అని తెలిసి జగన్ మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడితే ప్రచారానికి వచ్చాడు ఆయన…
నీకు ఏదైనా చేయాలనిపిస్తే గ్రామాల్లో సమస్యలపై పోరాడు.. ఆనాడు మా గ్రామంలో కరెంటు స్థంబాలు వేయమంటే వేయలేదు.. పదవిలో ఉండి కూడా కరెంటు స్థంబాలు వేయించుకోలేని ఈ పదవి ఎందుకు అని నేను నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశాను..ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావేమో…అమ్మని తిరగనివ్వట్లేదు..ఆడవాళ్ళకి ఎందుకమ్మా రాజకీయాలు అని అన్నావ్…ఆ మాట నువ్వు అన్నావో లేదో ప్రమాణం చేసి చెప్పు…ప్రెసిడెంట్ లు, ఎంపీటీసీలు అలా ఉంటారంతే రాజ్యాధికారం మొత్తం మాదే అన్నావ్..మీ ప్రెసిడెంట్ లను ఒకసారి అడగండి అభివృద్ధి అంటే ఏంటో…ఇటీవల గ్రామాల్లోకి వెళ్ళినపుడు ప్రెసిడెంట్ లు అందరూ ఒకటే మాట చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దయ వల్ల , మీ దయవల్ల నిధులు ఉంటున్నాయి..ఇది వరకు నిధులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవాళ్ళం..ప్రస్తుతం నిధులతో గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు..మూడు సంవత్సరాలు మేము దరిద్రపు పాలనను చూసాము..మాకు ఒక సంవత్సర కాలం మాత్రమే మాకు పదవి ఉంది..ఇంకొంత కాలం ఉంటే బాగున్ను అని మీ నాయకులే మాకు ధన్యవాదాలు చెప్పారంటే చూడు మీ పరిపాలన ఎలా ఉండేదో.. ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయాలనీ చూడకు.. ఎంత మందిని చంపుతావ్ నువ్వు మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా జనసైనికులు ఉన్నారు.. నీకు దమ్ముంటే మా ఇంటి గేట్ టచ్ చేసి చూడు.. నీకు దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలిచి చూపించు..ఇదే నా సవాల్..
