ఓడి పోరాదోయ్…!!
మైలవరం రాజకీయం లో ఊహించని పరిణామాలు…!!
మైలవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేరు…!!
అధికారిక ప్రకటన లాంఛనమే అంటున్న పార్టీ వర్గాలు…!!
అధికారిక ప్రకటన విడుదల అయిన వెంటనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తో ఎమ్మెల్యే వసంత భేటీ…!?
రాజకీయంగా బద్ద శత్రువులు గా ఉన్న ఇద్దరు నేతలు నియోజకవర్గం లో కలిసి చేస్తుంటే ఆ చిత్రాలు సూసిన ప్రజలు కంగు తినాల్సిందే మరి..
మైలవరం లో రాజకీయ ప్రత్యర్థులు గా తలపడిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఒకే వేదిక మీద కనిపించబోతున్నారా..? ఇప్పటి వరకు కత్తులు దూసుకున్న నేతలు కలిసి దుయ్యబోతున్నరా..? ఇప్పటి వరకు విడి విడిగా రాజకీయ యుద్దాలు చేసిన ఇరు నేతలు ఇప్పుడు ” కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోరాదోయ్ అంటూ పొలిటికల్ రొమాంటిక్ సాంగ్ ప్లే చేయబోతున్నారా…? ఈ ప్రశ్నలు అన్నిటికీ అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వసంత మైలవరం అభ్యర్ధి గా బరిలో నిలవడం దాదాపుగా ఖరారు అయ్యిందని విస్తృత ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన లాంచనమే అంటూ వార్తలు వస్తున్నాయి.. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటో తెలుసా.. ఆ ఇద్దరు నేతలు భేటీ కాబోతున్నారు అనే వార్త నెట్టింట చక్కర్లు కొట్టడం.. అది చదివిన మైలవరం నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.. రాజకీయాల్లో ఎప్పుడు ఎం జరుగుతోంది అనేది ఎవరూ ఊహించలేరు అనడానికి మైలవరం టిడిపి ఎపిసోడ్ ఉదాహరణగా నిలుస్తుంది.. ఎమ్మెల్యే వసంత మాజీ మంత్రి దేవినేని భేటీ జరిగితే మైలవరం రాజకీయ చరిత్ర లో సంచలనమే అవుతుంది అనేది స్పష్టం అవుతుంది.. చూడాలి మరి ఎం జరుగుతుందో..