SAKSHITHA NEWS

చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి కేంద్రాన్ని పున ప్రారంభించడానికి

చెన్నూర్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో “ఐ సి టి సి” ఎయిడ్స్ పరీక్ష కేంద్రం లేక పోవడంతో చెన్నూర్ తో పాటు పక్కనే ఉన్న కోటపల్లి, వేమనపల్లి మండలాల గర్భిణీలు హెచ్ఐవి అనుమానిత భాదితులు పరిక్షల కోసం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల మరియు గోదావరిఖని ప్రభుత్వ అసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతికోసం వచ్చే గర్భిణీలకు తప్పనిసరిగా ఎయిడ్స్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది..


వ్యాధి నిర్ధారణ అయినవారు మూడు నెలలకొకసారి మందులు తీసుకోవాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోగులు అనుమానితులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్కడికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పేద ప్రజలు ఎదుర్కొంటున్నారు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 2007లో “ఐ సి టి సి” కేంద్రాన్ని ప్రారంభించారు దానిలో 40 వేల పైచిలుకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించారు అందులో 12,814 మంది గర్భిణీలు పరీక్షలు చేయగా 31 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.. 27 వేల మంది అనుమానిత శ్రీ పురుషుల్లో 341 మందికి Hiv సోకింది..
చెన్నూరు లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ కేంద్రం పరిధిలో 372 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు..


SAKSHITHA NEWS