SAKSHITHA NEWS

సహనం కోల్పోయాను నేను మాట్లాడింది పొరపాటే: సిపి పివీ ఆనంద్?

హైదరాబాద్:
హైదరాబాద్‌ సీపీ సీవీ ఆ నంద్‌, నేషనల్‌ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్‌ పెట్టారు.

సంధ్య థియేటర్‌ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు.సంధ్య థియేటర్‌ వద్ద ఏం జరిగిందో తెలియజేస్తూ నగర పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

సంధ్య థియేటర్‌లో ఏం జరిగిందో తెలియజేస్తూ అక్కడి వీడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలో మీడియా ఆనంద్​ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా, నేషనల్‌ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.


SAKSHITHA NEWS