100% ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తా
నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తా నా సేవలు ఆగవు
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గము లో ఎక్కడ ఏ అభివృద్ధి పని చూసిన.నిరుపేద విద్యార్థులకు సహాయం చేసిన కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఐక్యత ఫౌండేషన్ తరపున పూర్తిగా ఉచితంగాఆరు అంబులెన్స్ ఏర్పాటు చేయడం. అమంగల్ పట్టణ కేంద్రంలో మూడు అంబులెన్స్ లు నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం. యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం. కనుమరుగవుతున్న పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం సహాయం చేయడం. ఇలా నియోజకవర్గ మొత్తం వినిపించే ఏకైక పేరు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్. సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఆయన సాక్షిత రిపోర్టర్ తో మాట్లాడుతూ కూడు.గూడ.గుడ్డ. ప్రజలకు చాలా అవసరమని తను పుట్టిన గడ్డ కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో 1.విద్యా.2. వైద్యం.3 ఉపాధి. ఎంతో అవసరమని చదువుకునే ప్రతి విద్యార్థికి ఐక్యత ఫౌండేషన్ అండగా ఉంటుందని ఎలాంటి సహాయం చేయడానికి ఐనా వెనుకాడదని వైద్యం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెళ్లడానికి ఐక్యత ఫౌండేషన్ తరపున ఇది ఉచిత అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే ఎవరైనా నిరుపేదలు అయ్యుంటే అలాంటివారికి వైద్య ఖర్చులకోసం సహాయం చేయడం జరుగుతుందని ఉపాధి విషయానికొస్తే ఎంతోమంది నిరుద్యోగులు టీచర్స్ కానిస్టేబుల్ ఎస్సై మొదలగు కోచింగ్ లకు ఐక్యత ఫౌండేషన్ తరపున ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని ఇంకా కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో తన సేవలను విస్తరిస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సమస్యలను తీరుస్తున్న ఏకైక వ్యక్తి ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరిస్తున్న నాయకుడు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారు. నిర్విరామంగా విరామం లేకుండా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో, పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఆలోచనతో పాఠశాలలలో కావలసిన వసతులు కల్పిస్తూ, మెరుగైన వైద్యం అందని నిరుపేద ప్రజల కోసం తన ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాలు అందిస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాడు.మేరుగైన వైద్యం కోసం సరైన వసతులు గల ఆసుపత్రులకు పేషంట్లని తీసుకొని వెళ్ళాలి అంటే చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉంటున్న పేద ప్రజలు ఎంతోమంది మెరుగైన వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్న తరుణంలో నేనున్నాను అండగా మీకు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు అంటూ ప్రజల్లో భరోసా కల్పిస్తూ ఐక్యత ఫౌండేషన్ ద్వారా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటిస్తున్న సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. డీజే సప్పులతో స్వాగతాలు పలుకుతూ గ్రామాలలో సభలు నిర్వహిస్తూ గ్రామాలలోనిసమస్యలు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కి తెలియజేసినా వెంటనే ప్రజా సమస్యలను తెలుసుకున్న ఒక ప్రజా నాయకుడిగా మనసున్న మారాజుగా ప్రజా సమస్యలను వెంబడే తీరుస్తున్నాడు. అన్ని విని ఎరగని రీతిలో సేవలు చేస్తు సేవల సునామీ పుట్టిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపించి తీర్తామని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఏ నాయకుడు అభివృద్ధి చేయలేదని కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని , అది రాఘవేందర్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని ప్రజల్లో చర్చలు ఊపుఅందుకున్నాయి. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తాను తీర్చాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని ఇప్పటివరకు అయితే ఎన్నో సమస్యలు తనకు సాధ్యమైనంత వరకు తీర్చానని, ఇంకా ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతానని ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.