హైడ్రా కూల్చివేతలు ఆగవు… ఆక్రమణదారులకు సీఎం రేవంత్ హెచ్చరిక…..!!!
ప్రాజెక్టుల వద్ద కొంతమంది విలాసవంతమైన ఫామ్ హౌజ్ లను నిర్మించారని,అక్కడి నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నోడి ఇంటి డ్రైనేజీతో నిండుతున్న ఆ చెరువులోని నీరు హైదరాబాద్ వాసులు తాగాల్నా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ సబ్ ఇన్స్పెక్టర్ల మూడో బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చెరువులను ఆక్రమణల నుంచి రక్షించేందుకు ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారు మర్యాదగా తప్పుకోవాలని, లేదంటే వాటిని కూల్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా.. న్యాయస్థానాల్లో కొట్లాడుతామని రేవంత్ రెడ్డి స్పష్టం అన్నారు. హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతుందని , ఆ కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని జిల్లా నేతలు కోరినట్లు వివరించారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తామన్నారు. మూసీ చుట్టూ ప్రక్కల పేదల ఆక్రమణలు ఉన్నాయన్న రేవంత్… వారి పట్ల ప్రభుత్వం మానవీయంగా ఆలోచిస్తుందని తెలిపారు.