SAKSHITHA NEWS

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సైకిల్ మరథాన్ పాల్గొన్న జె.వెంకట్
సికింద్రాబాద్ మార్చి 05 సాక్షిత సికింద్రాబాద్ మహిళలు అన్ని రంగాలలో వృద్ధి సాధించాలని.మరింత చైతన్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జె.వెంకటి అన్నారు.

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ డి.ఎం.హెచ్. ఓ కార్యాలయం వద్ద హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సైకిల్ మరథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సైకిల్ మారథాన్లో జిల్లా వైద్యాధికారులు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటి మాట్లాడుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు.

సృష్టికి మూలమైన మహిళలు అన్ని రంగాలలోనూ సమున్నత స్థానంలో ఉండాలని అన్నారు..భ్రూణ హత్యల నివారణ,పిల్లల పెంపకంలో ప్రత్యేక శ్రద్ద,నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు, మహిళలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS