SAKSHITHA NEWS

మానవత్వం చాటుకున్న పట్టణ ఎస్సై శివరామకృష్ణ.

పదవ తరగతి విద్యార్థి హాస్పిటల్ కి తీసుకొని వైద్యం అందించిన:ఎస్సై శివరామకృష్ణ.

చిలకలూరిపేట: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు 17వ తేదీ నుండి ప్రారంభమైన వీటికి అన్నిచోట్ల పటిష్టమైన కట్టుదిట్ట చర్యలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేసినారు.ఈ నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలో ఒక విద్యార్థి నిన్నటి నుండి జ్వరం,తీవ్రమైన హైడ్రేషన్ మరియు బలహీనతతో అనారోగ్యానికి గురై ఎగ్జామ్ కి హాజరు కావడం జరిగింది.ఈ రోజు కూడా ఎగ్జామ్ రాస్తుండగా ఆమె ఇబ్బంది గమనించిన ఉపాధ్యాయులు పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించిన చిలకలూరిపేట అర్బన్ ఎస్సై శివరామకృష్ణ ఆ విద్యార్థిని పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి, ఆమె అత్యధికంగా నీరసంతో ఉండడంతో గ్లూకోజులు ఎక్కించి మెరుగైన పరిస్థితి తీసుకొని వచ్చి జరిగింది.ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఎస్సై శివరామకృష్ణ ను అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app