హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి: ఎస్పీ కృష్ణారావు
….
సాక్షిత : – ఘనంగా 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం
– ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు
నరసరావుపేట..పల్నాడు:
శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్నారని పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. శనివారం నరసరావుపేట లింగంగుంట్లలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ కృష్ణారావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి గస్తీ, బందోబస్తు విధుల్లో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో హోంగార్డుల పాత్ర కీలకమన్నారు. హోంగార్డ్స్ బెనిఫిట్ ఫండ్ ద్వారా గాయపడిన వారికి రూ.20 వేలు, మరణిస్తే తక్షణ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్లు దాటిన వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నా మన్నారు. ఉద్యోగ రీత్యా సమస్యలుంటే నేరుగా తనను కలవచ్చని సూచించారు.
అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏడుగురు హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పరేడ్ కమాండర్ సుధాకర్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు జేవీ సంతోష్, సత్తిరాజు, లక్ష్మీపతి, డీఎస్పీలు హనుమంతరావు, గాంధీరెడ్డి, ఆర్‌ఐలు కృష్ణ, యువరాజ్, సీఐలు ఫిరోజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
